Latest Telugu Movie News
Telugu Movie news
సినీజోష్ రివ్యూ : మన శంకర వర ప్రసాద్ గారు
నటీనటులు : చిరంజీవి, వెంకటేష్ (ప్రత్యేక పాత్ర), నయనతార, కేథరిన్ థ్రెసా, సచిన్ ఖేడేకర్, శరత్ సక్సేనా, హర్షవర్ధన్, అభినవ్ గోమఠం, శ్రీనివాసరెడ్డి తదితరులు
ఎడిటింగ్ : తమ్మిరాజు
ఫోటోగ్రఫీ : సమీర్ రెడ్డి
సంగీతం : భీమ్స్ సిసిరోలియో
నిర్మాతలు : సాహు గారపాటి, సుస్మిత కొణిదెల
దర్శకత్వం : అనిల్ రావిపూడి
విడుదల తేదీ : 12-01-2026
కమర్షియల్ సక్సెస్సులకి
కేరాఫ్ అడ్రస్ గా మారి
కాంపిటీషన్ లేని స్టార్ డమ్ కి
ఎగ్జాంపుల్ గా నిలిచి
గత నాలుగు దశాబ్దాలుగా
చిన్నలనీ, పెద్దలనీ
రంజింపజేస్తూ
జీవిస్తోన్న
విలక్షణ నటుడు.. మెగాస్టార్ చిరంజీవి
పొలిటికల్ జర్నీ ముగించి రీ ఎంట్రీ ఇచ్చాక చిరంజీవి నుంచి ఖైదీ 150 , వాల్తేరు వీరయ్య వంటి సూపర్ హిట్స్ అయితే వచ్చాయి కానీ అవి మునుపటి మెగాస్టార్ మెరుపులను పూర్తి స్థాయిలో చూపలేకపోయాయి. సరిగ్గా అదే పాయింట్ పట్టుకున్నారు అనిల్ రావిపూడి. అభిమానులకి ఏం కావాలో గ్రహించారు. ప్రేక్షకులు ఏం ఆశిస్తున్నారో అంచనా వేశారు. చిరంజీవి అసలు పేరునే సినిమా టైటిల్ గా పెట్టేసారు. పండక్కి వస్తున్నారు అని ప్రకటించి మరీ పసందైన వినోదాల విందుని సిద్ధం చేసి పట్టుకొచ్చారు. మరిక లేటెందుకు.. మన వరప్రసాద్ గారు ఏ ఏ వంటకాలతో వచ్చారో, ఎలాంటి విందు భోజనం తెచ్చారో తెలుసుకుందాం రండి.
వినోదాల విస్తరి : కథ కోసం పెద్ద కాంప్లికేటెడ్ మ్యాటర్ కానీ, అద్భుతాలు చేసెయ్యాలనే ఆశల మూటని కానీ నెత్తికెత్తుకోలేదు జనం పల్స్ పట్టుకోవడంలో రాటుదేలిపోయిన రావిపూడి. జస్ట్.. విడాకులు తీసుకుని విడిపోయిన భార్యాభర్తలు మళ్ళీ ఎలా కలిసిపోయారు అనే అంశంతోనే వినోదాల విస్తరిని పరిచేసారు.
అలరించే దృశ్యాల అరిసెలు : వినోదమే ప్రధానమని హింట్ ఇచ్చేలా.. మాస్ ని ఉర్రుతలూగించే బాస్ ఇంట్రో ని సింపుల్ గా, సరదాగా కానిచ్చేస్తూనే కావాల్సిన ఎలివేషన్ ఇచ్చేసిన అనిల్ రావిపూడి ఆపై మాంచి కిక్కిచ్చే ఫైటు, హుక్కు స్టెప్పు పాటతో అభిమానులు ఆత్రంగా ఎదురుచూసే అరిసెలు అందించేసారు.
సున్నిత సన్నివేశాల సున్నుండలు : ఎంతటి మెగాస్టార్ అయినా ఏజ్ ఫ్యాక్టర్ అనేది ఒకటి ఉంటుంది. అది బ్యాలెన్స్ చేయడమే కాకుండా, అసలా సంగతే గుర్తుకురాకుండా చిరు - నయన్ ల మధ్య మాటలే లేని సున్నిత సన్నివేశాల సున్నుండలతో తెరపై తీయని ప్రేమకథ రుచి చూపించారు.
లేత మనసుల పూతరేకులు : తన పిల్లలకి దగ్గరవ్వాలనే శంకర వరప్రసాద్ తపనని చూపిస్తూనే ఆ పిల్లల స్వభావాన్ని, వారి పూత రేకుల్లాంటి లేత మనసులని ఆవిష్కరించిన తీరు, ముఖ్యంగా పిల్లలతో పాట, బ్రెడ్ ఆమ్లెట్ సీన్ అనిల్ రావిపూడి దర్శకత్వ ప్రతిభకు అద్దం పడుతుంది.
మామ అల్లుళ్ళ కోడి పుంజుల కోలాటం : మామా - అల్లుడు గొడవ పడితే మాటా మాటా అనుకోవడం మాములే. కానీ ఇక్కడ అల్లుడు ఆ మామకి OTP ఇస్తాడు. అందుకు ప్రతిగా మామ కవిత రాసి మరీ దరువులతో పాటగా పాడుతాడు. దానికి అల్లుడు గిల్లుడే ఈ సినిమాకి ఇంటర్వెల్ కార్డు. ఆ మామా అల్లుళ్ళ కోడిపుంజుల్లాంటి కొట్లాటలో ఫుల్ ఫన్ గ్యారంటీ.
మెగాస్టారే స్వయంగా కలిపిన పులిహోర : విడాకులు తీసుకుని విడిపోయిన భార్య తనపై విసుక్కుంటూ వుంటే భర్తలోని అహం కసురుకుంటుంది.. కస్సుమంటుంది. కానీ ఇక్కడ మళ్ళీ కలిసిపోదామని కాకాపడుతూ, ఆ మీసాల పిల్లతో స్వయంగా మెగాస్టారే కలిపిన పులిహోర రుచిని ఆస్వాదించి తీరాల్సిందే.
పట్టువిడుపులే అసలైన పాయసం : చిన్న చిన్న కారణాలతోనే భార్యాభర్తల బంధానికి బై బై చెప్పేస్తున్న నేటి తరం జంటలకు కనువిప్పు కలిగేలా, కనీసం ఆ ఆలోచన మెదిలేలా అత్తా కోడళ్ల మధ్య ఒక చిన్న కాన్వర్సేషన్ ని భలేగా కన్సీవ్ చేసారు అనిల్ రావిపూడి. పట్టు విడుపుల ధోరణే దంపతుల పాలిట పాయసమనే సూక్తిని క్లుప్తంగా చెప్పేసారు.
పోరాటాల కూరలతో ఘుమఘుమలాడే గారెలు : సంక్రాంతికి కనుమ, ముక్కనుమ తోడున్నట్టు, కక్కా - ముక్కా కావాల్సిందే అన్నట్టు - అంతా తీపే అయితే పండగ పూర్తవదు కనుక మాస్ కి కావాల్సిన మసాలాని దట్టించి పోరాటాల కూరలతో ఘుమఘుమలాడే గారెలనూ వడ్డించారు దర్శకుడు రావిపూడి.
చిరు - వెంకీ ఎగరేసిన పాటల పతంగులు : అందరు అనుకున్నట్టే ముందునుంచీ చిరు తన టైమింగ్ తో చితగ్గొడుతుంటే.. చివర్లో వెంకీ దిగి తన స్టైల్ లో విరగ్గొట్టేసారు. తెరపై వీరిద్దరూ కలిసి చేసిన అల్లరి అంతా ఇంతా కాదు. ముఖ్యంగా ఒకరి హిట్ సాంగ్ కి మరొకరు డ్యాన్స్ చేస్తూ పాటల పతంగులు ఎగరేసి సంక్రాంతి సందడిని పదింతలు పెంచేశారు.
సంక్రాంతికి తగ్గ షడ్రసోపేత భోజనం : మొత్తంగా చూసుకుంటే మన శంకర వరప్రసాద్ గారు సంక్రాంతికి తగ్గ షడ్రసోపేత భోజనాన్ని ప్రేక్షకుల ముందు పెట్టారు. ముఖ్యంగా మెగాభిమానులకైతే భుక్తాయాసం తప్పదు. తాము ప్రాణంగా ప్రేమించిన ఆనాటి చిరంజీవిని మరొక్కమారు తనివితీరా తెరపై చూసుకోవాలని తహతహలాడిన అభిమానుల దాహం తీర్చే తీరుతానంటూ అనిల్ రావిపూడి అత్యంత శ్రద్దగా చెక్కిన చిత్రమిది. ఇందులో జ్వాలా జ్వాలా అనే చంటబ్బాయి కనిపిస్తాడు. గోడ బద్దలుకొట్టే గ్యాంగ్ లీడర్ కనిపిస్తాడు. చిలిపిగా వంకర్లు తిరిగే శంకర్ దాదా కనిపిస్తాడు. ఇంటర్వెల్ బ్లాక్ లో ఘరానా మొగుడు ఇలా వచ్చి ఆలా వెళతాడు. అత్తకు యముడు అమ్మాయికి మొగుడు, రౌడీ అల్లుడు, అన్నయ్య వంటి పలు సినిమాల రెఫరెన్సులూ ఉంటాయి. అంతెందుకు.. ఫారెస్ట్ ఎపిసోడ్ లో స్వయంగా చిరునే ఇందువదన కుందరదన పాట పాడతారు. రామ్మా చిలకమ్మా, నవ్వింది మల్లెచెండు వంటి క్లాసిక్ సాంగ్స్ కి చిరు - వెంకీ కలిసి చిందేస్తారు. ఇంకా ఇలాంటివి ఎన్నో, ఎన్నెన్నో.!
మెస్మరైజ్ చేసిన మెగాస్టార్ : రీ ఎంట్రీ ఇచ్చి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసాక రెండు, మూడు సూపర్ హిట్స్ వచ్చాయి. తొమ్మిదేళ్లు గడిచాయి. కానీ ఎట్టకేలకు చిరంజీవి తన కంఫర్ట్ జోన్ లోకి వచ్చింది ఈ చిత్రంతోనే. అందుకే తనదైన కామెడీ టైమింగ్ తో చెలరేగిపోయారు. తన మార్క్ మేనరిజమ్స్ తో మెస్మరైజ్ చేసేసారు. డ్యాన్సులు దున్నేశారు - ఫైట్స్ లో కుమ్మేసారు కానీ అంతకుమించి, అసలు అన్నిటినీ దాటి తన లుక్స్ తో అందరినీ ఆశ్చర్యచకితుల్ని చేశారనడంలో అతిశయోక్తి లేదు. ఆయన నటన, అయన శైలి, అయన వ్యక్తిత్వమే కాదు ఆయన డిసిప్లిన్ అండ్ డెడికేషన్ కూడా నేటి తరానికి, భావి తరాలకి స్ఫూర్తిదాయకం మరియు మార్గదర్శకం.
పర్ ఫెక్ట్ ఛాయిస్ నయన్ : మెగాస్టార్ కి ధీటుగా నిలవాలంటే లేడీ సూపర్ స్టారే పర్ ఫెక్ట్ ఛాయిస్ అనిపించేలా తన నట నైపుణ్యంతో ఆకట్టుకుంది నయనతార. ప్రేమ, పొగరు, అహం, దర్పం, భార్యత్వం, మాతృత్వం అన్నీ కలగలిసిన ఆ శశిరేఖ పాత్రలో మరింకెవ్వరినీ ఊహించుకోలేనంతగా ఫిట్ అయింది నయనతార. కొన్ని సన్నివేశాల్లో ఆమె హావభావాలు నేటి నటీమణులకు పాఠాలు. మరీ ముఖ్యంగా ప్రసాద్ - శశిరేఖల మూడో కలయికలో సుందరి పాట రాలేదని ప్రసాద్ సందేహిస్తుంటే ఉన్నట్టుండి అదే పాట వినిపించే సందర్భంలో కళ్ళతోనే నయన్ నవ్విన నవ్వు ఎన్నిసార్లు చూసినా తనివితీరదేమో అనిపించేలా ఉంటుంది.
అడిషనల్ స్ట్రెంగ్త్ వెంకీ : తెరపై చిరు - తెరవెనుక అనిల్ కరెక్ట్ కో-ఆర్డినేషన్ తో కామెడీ పండించి ప్రేక్షకులకు గిలిగింతలు పెడుతుంటే సంక్రాంతికి వస్తున్నాం హీరో ఆ సరదాని, సందడిని మరింత పెంచేశారు. నిజానికి తనది అంత బలమైన పాత్ర కాకున్నా చిరుతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న వెంకీ మామ తన ఎనర్జీ తో ఈ చిత్రానికి అడిషనల్ స్ట్రెంగ్త్ అయ్యారు. మెగా - విక్టరీ స్పెషల్ సాంగ్ కోసం ఎదురుచూస్తోన్న ఆడియన్స్ చేత దానికంటే ముందే సాంగ్స్ మెడ్లీతో విజిల్స్ వేయించి క్లాప్స్ కొట్టించేసారు.
అదరగొట్టిన అనిల్ : ఎక్స్ పెరిమెంట్లు చేసెయ్యాలి - ఎక్సట్రార్డినరీగా తీసెయ్యాలి వంటి భేషజాలకు పోకుండా, బలమైన కథ - బరువైన భావోద్వేగాల జోలికి వెళ్లకుండా సంక్రాంతికి సరదాగా నవ్వుకుందాం, మనందరికీ నచ్చేలా వచ్చిన చిరంజీవిని మనసారా చూసుకుందాం అనేలా మన శంకర వరప్రసాద్ గారు చిత్రాన్ని మలిచారు మన అనిల్ రావిపూడి గారు. ఆడవాళ్లను కాపాడ్డానికి పెట్టిన చట్టాలతో మగాళ్లను కప్పెట్టేస్తారా అంటూ సెటైర్లతో నవ్వించిన అనిల్ అప్పట్లో వెంకీ ఆసనాన్ని పరిచయం చేసినట్టే ఇప్పుడు మందుబాబుల కోసం మధుపానం, మహదానందం, మనోధైర్యం, ధనా ధన్ అనే ప్రారంభ స్తోత్రాన్ని ప్రకటించారు. ముఖ్యంగా చిరు - నయన్ ల ప్రేమ కథను సుందరి సాంగ్ తో లింక్ చేస్తూ తెరకెక్కించిన విధానం, పాటల ప్లేసుమెంట్, ప్రథమార్ధాన్ని పరుగులు పెట్టించిన వైనం అభినందనీయం. ద్వితీయార్ధం కాస్త నెమ్మదించినా వెంకీ రాకతో మళ్ళీ ఊపు తీసుకొచ్చారు కానీ క్లయిమాక్స్ ఫైట్ లో వెంకీ ని ఇన్ క్లూడ్ చేయడం రజనీకాంత్ జైలర్ క్లయిమాక్స్ కి కాపీ పేస్ట్ లా ఉంది. మరి ఆదమరిచారో లేక తెలిసే మలిచారో ఆయనే చెప్పాలి. బై ది వే.. దర్శకుడిగా అపజయమంటూ ఎరుగని అనిల్ రావిపూడి ఈ చిత్రంతో ట్రిపుల్ హ్యాట్రిక్ కొట్టిన సందర్భంగా కంగ్రాట్స్.!
అంకితభావంతో యూనిట్ : కేథరిన్, సచిన్ ఖేడేకర్, శరత్ సక్సేనా, జరీనా వాహబ్ మరియు ఇతర నటీనటులందరూ పాత్రోచితంగా నటించారు. మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ తనకు దక్కిన మెగా ఆపర్చ్యునిటీని చక్కగా వినియోగించుకున్నాడు. అన్ని పాటలనీ చార్ట్ బస్టర్లుగా మలచడంతో పాటు సందర్భోచితంగా మెగా హిట్ సాంగ్స్ ని BGM లో ధ్వనింపచేసి శెభాష్ అనిపించుకున్నాడు. సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ మరో హైలైట్. పండగ రిలీజ్ టార్గెట్ తో, పక్కా ప్రణాళికతో, వేగంగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని క్వాలిటీ విషయంలో ఏమాత్రం తగ్గకుండా చూసుకున్న సమీర్ మెగాస్టార్ ని మ్యాచోగా చూపించడంలో సినిమాటోగ్రాఫర్ గా తన అనుభవాన్ని చాటుకున్నారు. సెకండాఫ్ లో విషయం తగ్గి సినిమా నెమ్మదించింది కానీ ఆ తప్పు ఎడిటర్ తమ్మిరాజుది కానే కాదు. ఫైట్ మాస్టర్లు బడాయిలకి పోకుండా నమ్మదగ్గ రీతిలోనే కంపోజ్ చేసారు కనుక కంప్లైట్లు రానే రావు. నిర్మాతగా సాహు గారపాటి మరో ఘన విజయమిది. మెగా తనయ సుస్మితకు తొలి విజయమిది.
రిజల్టు ఫిక్స్.. రికార్డులే బ్యాలెన్స్ : ప్రీమియర్ షోస్ నుంచే యునానిమస్ హిట్ టాక్ తెచ్చేసుకున్న మన శంకర వరప్రసాద్ గారు ఈ సంకాంతి బరిలో బాక్సాఫీసుని రఫ్ఫాడించడం ఫిక్స్. ఇక రికార్డులే బ్యాలెన్స్. పండగ సీజన్ లో ఫ్యామిలీ ఆడియన్సుని థియేటర్లకు లాక్కొచ్చే అంశాలతో పాటు.. అభిమానులు మళ్ళీ మళ్ళీ రిపీట్స్ వేసే పలు ఎలిమెంట్స్ ఉన్నాయి కనుక కలెక్షన్ల వరద ఖాయం.. కొత్త రికార్డులు తధ్యం అంటోంది ట్రేడ్ రిపోర్ట్. మొత్తానికైతే మన శంకర వరప్రసాద్ గారు పండక్కి వచ్చారు. మెగా జాతర మొదలుపెట్టారు.!
పంచ్ లైన్ : మన శంకర వరప్రద్ గారు - రఫ్ఫాడించారు !
సినీజోష్ రేటింగ్ : 3/5
సినీజోష్ రివ్యూ: ది రాజా సాబ్
నటీనటులు: ప్రభాస్, సంజయ్ దత్, మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్, జరీనా వాహబ్, బొమన్ ఇరానీ, విటివి గణేష్, సప్తగిరి, సత్య, సముద్ర ఖని, ప్రభాస్ శ్రీను తదితరులు
ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు
సినిమాటోగ్రఫీ: కార్తీక్ పళని
సంగీతం: ఎస్ థమన్
నిర్మాత: టిజి విశ్వప్రసాద్
రచన, దర్శకత్వం: మారుతి
విడుదల తేదీ: 09-01-2026
డిఫరెంట్ డిఫరెంట్ సబ్జెక్టులని ఒప్పుకోవడం
ప్రభాస్ స్టైల్ !
వెరైటీ వెరైటీ క్యారెక్టర్స్ కై సిద్ధపడడం
ప్రభాస్ స్ట్రెంగ్త్ !
అందుకే ఈ రెబల్ స్టార్ చేసినన్ని
విభిన్నచిత్రాలు, వైవిధ్యభరిత పాత్రలు
ఈ జనరేషన్ లోని మరే స్టార్ హీరో
ట్రాక్ రికార్డు లోను కనపడవు.
ఇప్పుడు అదే కోవలో ప్రభాస్ చేసిన
లేటెస్ట్ ఎక్స్ పెరిమెంట్.. ది రాజా సాబ్
పాన్ ఇండియా స్టార్ అయిన ప్రభాస్ - మారుతి వంటి మిడ్ రేంజ్ డైరెక్టర్ కి ఓకే చెప్పడమే ఒక వింత అనుకుంటే.. అదీ హారర్ మూవీ అంటూ ప్రకటన రావడం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. అభిమానుల్లో అయితే భయం రేకెత్తించింది. కానీ ఇది కేవలం హారర్ మూవీయే కాదనీ హారర్ ఫాంటసీ అనీ, హారర్ థ్రిల్లర్ అనీ, హారర్ కామెడీ అనీ, యాక్షన్ అండ్ రొమాన్స్ కూడా ఫుల్లుగా వుండే పక్కా కమర్షియల్ సినిమా అనీ చెబుతూ రాజా సాబ్ పై కొంతమేరకు మంచి అంచనాలను రప్పించగలిగారు దర్శకుడు మారుతి. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రభాస్ కూడా కాస్త కాన్ఫిడెంట్ స్పీచ్ ఇవ్వడంతో ఫ్యాన్స్ లాట్స్ ఆఫ్ హోప్స్ తో థియేటర్స్ కి కదిలారు. నైజాంలో ప్రీమియర్స్ విషయం గందరగోళానికి గురి చేసినా ఆంధ్రతో సహా ఇతర అన్ని చోట్ల నిన్న నైట్ నుంచే రాజా సాబ్ రచ్చ షురూ అయిపొయింది. మరింతకీ మారుతి తన మాట నిలుపుకున్నారా లేక తన పాత పక్కా కమర్షియల్ బాటలోనే సాగారా అన్నది సమీక్షలో చూద్దాం.
మారుతి ఏం చెప్పి ఒప్పించారు (కథ)
ప్రభాస్ - మారుతి కాంబినేషన్ ఏంటసలు అని ఎందరిలోనో ఎన్నో సందేహాలున్నా... ప్రభాస్ వంటి హ్యూజ్ స్టార్ మోజు పడ్డారంటే మారుతి కథలో ఎంతో కొంత విషయం ఉండే ఉంటుంది అనేది కొందరి నమ్మకం. మరి ఆ సందేహమే సరైనదా లేక నమ్మకం నిజమైందా? కథేంటో తెలిస్తే క్లారిటీ మీకే వచ్చేస్తుంది. అనగనగా ఓ మహల్. అందులో ఒక క్షుద్ర శక్తి వంటి ప్రేతాత్మ. ఆ ప్యాలెస్ లోకి ఎవరు ఎంటర్ అయినా ఎగ్జిట్ ఉండదనే నానుడి. అందులోకి హీరోగారి ప్రవేశం. ఆ ఆత్మతో చేసే పోరాటం. అంతం చేసే విధానం. ఇదీ క్లుప్తంగా కథ. మారుతి గారు నాలుగున్నర గంటల నిడివిని తీసి మూడు గంటలకు కుదించి వదిలిన కఠోర కథ. ఇంతోడిదానికి మూడేళ్లు ఎందుకు చెక్కారో అంతుచిక్కని, అర్ధం కాని, అర్ధం లేని కథ. సరే.. కథదేముంది.. కథనం కదా ముఖ్యం అంటారా. ఆ చక్కని భాగోతాన్నీ చర్చించుకుందాం.
మారుతి తెర పైకి ఏం రప్పించారు (కథనం)
సినిమా ప్రారంభంలోనే ఓ బంగ్లాను చూపించి భయం పుట్టించాలి. ఆపై హీరోగారి ఎంట్రీ. ఒక పాట. ఒక ఫైటు. ఒక నానమ్మ. ఒక అవసరం. హీరోగారు ఆ భయంకర బంగ్లాకు బయలుదేరాలి. మధ్యలో ఒక ఆకర్షణ. ఆ అమ్మాయి అందాల ఆరబోతతో మరొక పాట చిత్రణ. హీరోగారిని ప్రేమించే ఒకమ్మాయిని చూపించి, హీరోగారు ప్రేమించే మరో అమ్మాయినీ తెచ్చేసాం కనుక ఇక మూడో భామని లాక్కొచ్చే తరుణం. మధ్యలో అన్నీ ల్యాగ్ సీన్లు. స్టాకు జోకులు. మొత్తానికి హీరోగారిని మహల్ కి చేర్చాక విరామ సమయమనే విషయం గుర్తొచ్చి విలన్ గారు దర్శనమిస్తారు. ఇంటర్వెల్ లో బయటికి వచ్చిన బ్రిలియంట్ ఆడియన్స్ ఎందుకైనా మంచిదని ఇంటి అడ్రెస్ మొబైల్ లో టైపు చేసుకుని పెట్టుకుంటారు. ఇక సెకండాఫ్ మొదలయ్యాక కూడా అదే లాగుడు.. అవే ల్యాగులు. హర్రర్ సినిమాలో ఎర్రర్ లా చిర్రెత్తించే చిరాకైన కామెడీని, భయపెట్టే ప్రదేశంలో ఉండి కూడా భామలతో రొమాన్స్ చేసే హీరోగారిని చూసి సగటు ప్రేక్షకుడిలో స్పందన కరువవుతుంది. సరిగ్గా జనానికి మతి భ్రమించే సమయానికి మారుతి గారిలో చలనం వచ్చి, జాలి కలిగి కాస్త విషయం ఉన్న క్లయిమాక్స్ తో ముగిస్తారు. చలికాలంలో కూడా నిట్టూర్పులతో వేడెక్కిపోయిన థియేటర్స్ నుంచి జనం దీంతో పోల్చుకుంటే ఎంత చలినైనా భరించెయ్యొచ్చనే భావనతో వేగంగా బయటికి కదులుతారు. ఇదీ మ్యాటర్ !
మారుతి ఏ విధంగా నొప్పించారు (విశ్లేషణ)
విషయం వీక్ గా ఉన్నప్పుడే పబ్లిసిటీ పీక్ లో ఉంటుందనే పాపులర్ డైలాగ్ ఒకటుంది. మరి అదే ఫాలో అయ్యారో లేక తాను తీసిందే అద్భుతమనే ఫీలింగ్ లో ఉన్నారో కానీ, రాజా సాబ్ ప్రమోషన్స్ లో చాలా పెద్ద పెద్ద స్టేట్ మెంట్స్ ఇచ్చేసారు మారుతి. చివరికి పబ్లిక్ గా తన ఇంటి అడ్రెస్ కూడా చెప్పేసేంత వరకూ వెళ్ళింది వ్యవహారం. వెయ్యి కోట్లు అలవోకగా తెచ్చిపెట్టగల హీరో.. వందల కోట్లను ధారపోసిన నిర్మాత, మూడేళ్ళ సమయం.. ఇన్ని దొరికినా విషయం లేని కథని విస్తరించుకుంటూ పోయి, వీక్షకులను విసిగించే అవుట్ ఫుట్ పట్టుకొచ్చి, మంచి అవకాశాన్ని మన్ను పాలు చేసుకున్నారు మారుతి. అసలీ సినిమాకి ముగ్గురు హీరోయిన్లు ఎందుకో ఆయనకే తెలియాలి. అసలు సినిమాలోనే లేని ప్రభాస్ ఓల్డ్ గెటప్ ని మోషన్ పోస్టర్ చేయించి మరీ ఎందుకు రిలీజ్ చేసారో ఆయనే చెప్పాలి. స్కై లెవెల్ క్రేజ్ ఉన్నా, హై లెవెల్ డిమాండ్ ఉన్నా స్వీట్ హార్ట్ తో గ్రేట్ ఛాన్స్ ఇచ్చిన డార్లింగ్ ప్రభాస్ కీ - ముఖ్యంగా రేపటినుంచీ రెచ్చిపోయే ప్రభాస్ ఫ్యాన్సుకీ ఆయనే సమాధానం ఇవ్వాలి.
ప్రభాస్ ఏ మేరకు మెప్పించారు (వివరణ)
ఈ సినిమాకు ఏకైక సేవింగ్ గ్రేస్.. డార్లింగ్ ప్రభాస్. చాలా సంవత్సరాల తరువాత మాంచి స్టైలిష్ లుక్ లో కనిపించిన ప్రభాస్ తన ఇన్ బిల్ట్ గ్లామర్ తో కవ్వించారు. నవ్వించారు. మారుతి తప్పిదాన్ని తన స్క్రీన్ ప్రెజన్స్ తో కాస్తయినా కప్పిపుచ్చే ప్రయత్నం చేసారు. కానీ బాగా ఫైట్స్ చేసే ప్రభాస్ అక్కడున్నపుడు అవి ఆ స్థాయిలో డిజైన్ చేసుకోవాలి కదా. చాలాకాలానికి చిందేసేందుకు ప్రభాస్ సిద్ధపడ్డప్పుడు ఆ పాటల్లో అంతటి మ్యాటర్ పెట్టుకోవాలి కదా. అవేమీ జరగలేదు. అందుకే అభిమానులకి ఆశించిన ఊపు రాలేదు. అసలు ప్రభాస్ ఒక్కొక్క సీన్ లో ఒక్కొక్కలా కనిపించడం ఏంటనేది ఎవ్వరికీ అర్ధం కావట్లేదు. అయితే సినిమా మొదట్లో తనదైన కామెడీ టైమింగ్ చూపించిన ప్రభాస్ ఆపై హాస్పిటల్ సీన్ లోను, క్లయిమాక్స్ పార్ట్ లోను అభినయంతో బాగా ఆకట్టుకున్నారు. రెండు పాటల్లో చలాకీగా స్టెప్పులేసి ఫ్యాన్సుకి తనవంతు కనువిందు చేసారు.
ప్రమాదాన్ని టీమ్ ఎంతవరకు తప్పించారు (విచక్షణ)
సినిమాటోగ్రాఫర్ కార్తీక్ పళని బాగానే కష్టపడ్డారు కానీ విలక్షణత లేవి VFX వల్ల విజువల్ క్వాలిటీలో లోపాలు కనిపించాయి. ముఖ్యంగా సెట్స్ అన్నీ సెట్స్ లాగే తెలిసిపోవడం ఈ తరహా సినిమాలకు అసలు సెట్ కాదు. సీనియర్ ఎడిటర్ కోటకిరి వెంకటేశ్వరరావు నాలుగున్నర గంటల ఫుటేజ్ ని మూడు గంటలకు కుదించారు కానీ అందులోని మరో అరగంట అక్కర్లేని నసని వదిలేసారు. థమన్ ఏదో దంచేసే ప్రయత్నం చేసినా నేపథ్య సంగీతం అంతంత మాత్రంగానే వుంది. పాటలైతే ప్రభాస్ లాంటి హీరోకి ఇవ్వాల్సినవి కావు. ఆ మాటకొస్తే ప్రస్తుతం వున్న ఫామ్ లో థమన్ చెయ్యాల్సినవే కావు. రాజా సాబ్ కోసం ముందు కంపోజ్ చేసిన పాటలను పక్కన పెట్టి ఫ్రెష్ గా మళ్ళీ చేస్తున్నానని ప్రకటించిన థమన్ బహుశా ముందే బాగా చేసి ఉంటారేమో. నిన్న తను రిలీజ్ చేసిన పాట వింటే మీరూ ఇదే మాట అంటారు. ఇక ఇతర సాంకేతిక వర్గమంతా పారితోషికాలకి, మారుతి గారి విధానాలకి, విజువల్ సెన్స్ కి తగ్గట్టే పనిచేసారు.
నటీనటుల్లో ప్రభాస్ తరువాత ప్రముఖ పాత్రలు బాలీవుడ్ ఆర్టిస్టులు సంజయ్ దత్, జరీనా వాహబ్, బొమన్ ఇరానీలకు దక్కాయి. ముఖ్యంగా జరీనా వాహబ్ హీరో నాయనమ్మ పాత్రకు ప్రాణం పోశారు. సంజయ్ దత్ స్థాయికి తగ్గ స్ట్రెంగ్త్ ఆ పాత్రలో కొరవడింది. బొమన్ ఇరానీకి ఇలాంటి పాత్రల పోషణ ఎప్పుడో కేక్ వాక్ లాగా మారింది. సముద్రఖని పాత్ర పరిమితం. కమెడియన్లు ఎంతోమంది వున్నా కామెడీ ఎందుకు పండలేదన్నది ప్రశ్నర్ధాకం. ఇక ఒక హిట్టుకి మూడు ప్లాపులు అన్నట్టుగా సాగుతున్న పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కి, నిబద్ధత కలిగిన నిర్మాత TG విశ్యప్రసాద్ పయనానికి ఈ సినిమా కఠినమైన పరీక్షే.. కాస్తంత ప్రమాదమే.!
ప్రేక్షకులతో ఫైనల్ గా ఏం చెప్పించారు (విచారణ)
సకాలంలో రాలేకపోయినా సంక్రాంతి బరిలోకి దిగే మొదటి స్లాట్ దక్కించుకున్నాడు రాజా సాబ్. ఇదే తొమ్మిదో తేదికి రిలీజ్ డేట్ ప్రకటించి ఓవర్సెస్ లో ఓ రేంజ్ లో రెచ్చిపోతోన్న క్రేజీ తమిళ్ చిత్రం జననాయగన్ ఉన్నట్టుండి వాయిదా పడడంతో రాజా సాబ్ రచ్చకు రంగం మరింత మెరుగుపడింది. అయితే రీజనబుల్ టాక్ వచ్చినా రికార్డులు గల్లంతు చేసే మహత్తర అవకాశాన్ని చేజేతులా చెడగొట్టుకున్నారు దర్శకుడు మారుతి. గంపెడాశతో వచ్చిన ప్రేక్షకాభిమానులను గందరగోళానికి గురి చేసి ప్రీమియర్ షోస్ నుంచే డ్యామేజ్ రిపోర్ట్స్ తో స్టార్ట్ అయిన ఈ రాజాసాబ్ జర్నీని ఇక ప్రభాస్ ఇమేజు, సీజన్ అడ్వాంటేజులే నడిపించాలి. అన్నట్టు ఈ చిత్ర రాజానికి సీక్వెల్ కూడా ఉంటుందంటూ, ప్రభాస్ ని జోకర్ గెటప్ లో చూపిస్తూ రాజాసాబ్ సర్కస్ 1935 అనే టైటిల్ ని కూడా ప్రకటించేసారు మావెరిక్ డైరెక్టర్ మారుతి.
(PS: ఎంతో ఆర్భాటంగా రిలీజ్ చేసిన ప్రభాస్ ఓల్డ్ గెటప్ ఇందులో లేకపోవడానికి కారణం.. బహుశా మొదట్లో ఆ లుక్ సీక్వెల్ కోసం అనుకుని, ప్రభాస్ అలా ఎప్పుడు కనిపిస్తారా అని అందరూ ఎదురుచూసేలా చేసి, ఎండ్ లో దాన్ని రివీలింగ్ తో పార్ట్ 2 ఎనౌన్స్ మెంట్ ప్లాన్ చేసి ఉంటారు. అయితే సడెన్ గా మారుతికి సర్కస్ చేయాలని అనిపించడంతో జోకర్ లుక్ లాక్ అయి ఉంటుంది అనేది ఒక విశ్లేషకుడి మాట)
పంచ్ లైన్ : ది రాజాసాబ్.. నాసిరకం నవాబ్ !
సినీజోష్ రేటింగ్ : 2/5
సినీజోష్ రివ్యూ: శంబాల
నటీనటులు: ఆది సాయికుమార్, అర్చన అయ్యర్, శ్వాసిక విజయ్, మధు నందన్, హర్ష వర్ధన్, రవి వర్మ, శివ కార్తీక్ తదితరులు
సినిమాటోగ్రఫీ: ప్రవీణ్
ఎడిటర్: శర్వన్
సంగీతం: శ్రీ చరణ్ పాకాల
నిర్మాతలు: మహీధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభీమోజు
దర్శకత్వం: యుగంధర్ ముని
విడుదల తేదీ: 25-12-2025
థియేటర్స్ కి తిరుగులేని క్రౌడ్ పుల్లర్
అందర్నీ ఆకర్షిస్తోన్న రియల్ కిల్లర్
మిస్టిక్ థ్రిల్లర్ !!
సరిగ్గా ఇదే జోనర్ ని ఏరికోరి ఎంచుకున్నాడు
ప్రస్తుతం ఆచితూచి అడుగులేస్తున్న ఆది సాయికుమార్.
టైటిల్ అనౌన్స్ మెంట్ నుంచే ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిన శంబాల టీజర్ అండ్ ట్రైలర్స్ తో మాంచి మిస్టికల్ థ్రిల్లర్ అనే ఇంప్రెషన్ తెచ్చుకుంది. ప్రభాస్, నాని, సాయి తేజ్, సందీప్ కిషన్, అనిల్ రావిపూడి, థమన్ వంటి వారంతా అండగా నిలవడంతో శంబాల ప్రమోషన్స్ పీక్ కి చేరుకున్నాయి. ఫైనల్ గా నిన్న ప్రీమియర్స్ నుంచే మంచి టాక్ తెచ్చుకున్న శంబాల నేడు ఘనంగా విడుదలైన నేపథ్యంలో ఈ చిత్రం రిజల్ట్ ఏంటో, దక్కుతున్న రిసెప్షన్ ఎలా వుందో, ఆది సాయికుమార్ కి ఆశించిన కమ్ బ్యాక్ ఇస్తుందో లేదో రివ్యూలో చూద్దాం.
శంబాల.. కథగా ఏం చెప్పింది ?
వెయ్యేళ్ళ చరిత్ర కలిగిన శంబాల అనే ఊరిలో ఆకాశం నుంచి ఓ ఉల్క పడుతుంది. అప్పట్నుంచి అక్కడ జనాల విచిత్ర ప్రవర్తనలు, హత్యలు, ఆత్మహత్యలతో ఊరు ఊరంతా అట్టుడికిపోతుంది. తమకేదో బండ భూతం ఆవహించేసిందనే మూఢ నమ్మకంతో గ్రామస్తులంతా భయబ్రాంతులకు లోనవుతారు. ఆ విపత్కర పరిస్థితిని చక్కదిద్ధేందుకు ప్రభుత్వం విక్రమ్ (ఆది సాయికుమార్) అనే శాస్త్రవేత్తను నియమిస్తుంది. ఓ శాస్త్రవేత్తగా పూర్తిగా సైన్స్ నే నమ్మే విక్రమ్ ఆ ఊరిలో జరిగే వింత సంఘటనలను ఎలా విశ్లేషిస్తాడు, ఏ విధంగా పరిష్కరిస్తాడు, ఈ ప్రాసెస్ లో ఎటువంటి సిట్యుయేషన్స్ ఫేస్ చేస్తాడు అనేదే శంబాల కథ.
శంబాల.. కథనం ఎటు సాగింది ?
1980 నేపథ్యంతో సాగే ఈ కథలో ఆ ఊరి చరిత్ర వెనుక దాగిన శాస్త్రానికి.. సైంటిస్ట్ విక్రమ్ నమ్మే సైన్సుకీ కరెక్ట్ కాన్ ఫ్లిక్ట్ క్రియేట్ చేయడమే శంబాలకు మెయిన్ ప్లస్ పాయింట్ అయింది. ఉత్కంఠ రేకెత్తించే రహస్య కోణంతో ఒక ఊరి కథగా ప్రారంభమై పలు గగుర్పొడిచే సన్నివేశాలతో కథా గమనం పరుగులు పెడుతుంది. అందులో భలేగా అనిపించేవి కొన్ని. భయపెట్టేవి ఇంకొన్ని. మొత్తానికి చకచకా సాగిన కథనం విరామ ఘట్టంతో ప్రేక్షకుడి ఆసక్తిని తారాస్థాయికి చేరుస్తుంది. ప్రథమార్ధమంతా ప్రశ్నలతో నింపేసిన దర్శకుడు ద్వితీయార్ధంలో అసలు సిసలు శంబాల ప్రపంచాన్ని ఆవిష్కరిస్తారు. ఊరి దేవత చరిత్ర, అరిషడ్వార్గాల కోణం, ఉల్క పడే పరిణామం వంటి అంశాలతో ప్రతి ప్రశ్నకు ప్రేక్షకుడికి సముచిత సమాధానం ఇవ్వడం దర్శకుడి ప్రతిభకు తార్కాణం. సినిమా ముగింపు దశకు చేరేసరికి హీరో చేసే పోరాటం అబ్బురపరుస్తుంది, చిన్నారితో ముడిపెట్టడం భావోద్వేగాన్ని పంచుతుంది కానీ ఆద్యంతం ఉత్కంఠభరితంగానే అనిపించడంతో శంబాల సక్సెస్ సంభవం అనేది అలవోకగా జరిగిపోయింది.
శంబాల.. ఆదిని ఎలా చూపించింది ?
వరుసగా సినిమాలు చేస్తున్నా, ఓటీటీలో అవి బాగానే రీచ్ పొందుతున్నా సరైన థియేట్రికల్ సక్సెస్ లేక సఫర్ అవుతున్న ఆది సాయికుమార్ కి వరంలా దొరికింది శంబాల స్క్రిప్ట్. జనం మెచ్చే జానర్ నీ, తనకు నప్పే పాత్రనీ ఎంచుకోవడంలో పరిణతి చూపిన ఆది సైంటిస్ట్ విక్రమ్ పాత్రలో తన నట ప్రతిభనూ ప్రదర్శించాడు. ఇన్ని డ్యూయెట్లు కావాలి, అన్ని ఫైట్లు ఉండాలి అనే లెక్కలకు పోకుండా కథకు, కథలోని పాత్రకు సరైన న్యాయం చేస్తూ సెటిల్డ్ పర్ ఫార్మెన్స్ తో శెభాష్ అనిపించుకున్నాడు ఆది. అతను ఆశించిన కమ్ బ్యాక్ సక్సెస్ శంబాల అందించడం ఇక అనివార్యమే అనొచ్చు. కథానాయిక అర్చన అయ్యర్ క్యారెక్టర్ ఆడియెన్సుని థ్రిల్ చేస్తుంది. రవి వర్మ, మీసాల లక్ష్మణ్, మధునందన్, శ్వాసిక, శైలజ, బేబీ చైత్ర, తదితరుల పాత్రలు సైతం కథలో భాగంగా కలిసిపోయి కథనం రక్తి కట్టేందుకు కారణమయ్యాయి.
శంబాల.. టీమ్ ఎంత ఎఫర్ట్ పెట్టింది ?
శంబాల టీమ్ లో మొదటగా అభినందించాల్సింది దర్శక, నిర్మాతలనే. ఓ మిస్టికల్ థ్రిల్లర్ కి కావాల్సిన అన్ని అంశాలను మేళవిస్తూ కథని రాసుకున్న విధానంలో దర్శకుడు యుగంధర్ ముని కన్విక్షన్ కనిపిస్తే, దాన్ని తెరపైకి తీసుకురావడంలో నిర్మాతలు మహీధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభీమోజు చూపిన రాజీ పడని ధోరణి తెలుస్తుంది. ప్రవీణ్ సినిమాటోగ్రఫీ సినిమాని మరో స్థాయికి చేర్చింది. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందుకు మరింతగా తోడ్పడింది. ఎడిటిండ్ అండ్ ఆర్ట్ విభాగాలు కూడా తమ బాధ్యతను సమర్ధవంతంగా నిర్వర్తించాయి.
శంబాల.. ఎంతవరకూ ఆకట్టుకుంటుంది ?
ఓవరాల్ గా శంబాల ఎలా ఉందనే ఎనాలసిస్ విషయానికి వస్తే.. ఫస్టాఫ్ మొత్తం ఉత్సుకత రేపుతోంది. ఇంటర్వెల్ ఎపిసోడ్ ఉత్కంఠను పెంచుతుంది. ఆపై సెకండాఫ్ లో అన్ని క్వశ్చన్సుకి కన్విన్సింగ్ ఆన్సర్ లభిస్తుంది. సంతృప్తికరమైన ముగింపుతో ప్రేక్షకుడిని పంపిస్తుంది. VFX ఇంకా బెటర్ గా ఉండాలని చెప్పే విమర్శకులు ఈ బడ్జెట్ లో ఇటువంటి అవుట్ ఫుట్ తేవడం వెనుక నిర్మాతల కృషిని మరిచిపోకూడదు. అలాగే ముగింపు మరికాస్త బలంగా ఉండాలని కోరుకునే విశ్లేషకులు దర్శకుడు మరో భాగం ఉందని చెప్పిన విషయాన్ని విస్మరించకూడదు. మిగతా జనాలకు మాత్రం ఇది నచ్చే సినిమానే. మిస్టిక్ థ్రిల్లర్స్ ఇష్టపడే వారందరూ మెచ్చే సినిమానే.
పంచ్ లైన్ : శాటిస్ ఫై చేసేలా.. శంబాల !
సినీజోష్ రేటింగ్ : 3/5
Tollywood News (English version)
Narendra Modi's biopic, titled Maa Vande, stars Unni Mukundan as India's 3-time PM.
An entertainer titled Cheen Tapak Dum Dum was officially launched today in Hyderabad.
Satvika Veeravalli is the female lead in Aakasamlo OKa Tara, starring Dulquer Salmaan in the lead.
On Monday, Johnny and Badri actress Renu Desai addressed a press conference in support of stray dogs.
Anaganaga Oka Raju was among the last Sankranthi releases.
In a few hours from now, Mana Shankara Vara Prasad Garu is going to enter the Rs 300 Cr club.
In Mana Shankara Vara Prasad Garu, a tight slap by the husband (Chiranjeevi) becomes the tipping point in his relationship with his wife (Nayanthara).
The 2026 Golden Globes witnessed an incident that has since ignited social media buzz.
Paul Thomas Anderson's One Battle After Another is emerging as the clear favorite for the 2026 Best Picture statuette.
A grand Free Mega Diabetes Treatment Camp will be held on January 20, 2026, to honor the 86th birth anniversary of the legendary actor and former Union Minister, Sri Uppalapati Venkata Krishnam Raju.
In The Raja Saab, Nidhhi Agerwal plays a Nun who looks the part. In her first post-release interview, the star heroine says that lots of discussions and brainstorming went into the role. "I proudly say that I belong to Telugu cinema. Recently, when I visited Mumbai, many people spoke about how Telugu films are being made on such a large scale with high quality," says Nidhhi in this interview.
Prabhas has assured director Maruthi that The Raja Saab will eventually reach the audience. As per the filmmaker, the fantasy and psychological horror elements are slowly being appreciated by the audience. In a media interaction on Tuesday, Maruthi expressed immense satisfaction over the film grossing Rs 200 Cr in four days.
Bhartha Mahasayulaku Wignyapthi is slated to be released in theatres on January 13. Fronted by Ravi Teja, Ashika Ranganath and Dimple Hayathi, the family entertainer is directed by Kishore Tirumala of Nenu Sailaja and Chitralahari fame. In this interview, Tirumala ruminates on the film.
With the success of Anaganaga Oka Raju, Meenakshi Chaudhary will be on a hat-trick as far as Sankranthi releases are concerned. She plays Charulatha, a dad's princess, in this January 14th release. In this interview, the Guntur Kaaram actress talks about her character in the family entertainer, working with Naveen Polishetty, and reuniting with the prestigious Sithara Entertainments.
Nari Nari Naduma Murari, fronted by Sharwanand, is a family entertainer co-starring Samyuktha Menon as a female lead. In this interview, the Bimbisara, Virupaksha and Bheemla Nayak heroine talks about the movie, which is slated to be released in theatres on January 14.
Nari Nari Naduma Murari is a youthful, fun-filled entertainer, says director Ram Abbaraju, whose film is slated to be released in theatres on January 14. In this interview, he talks about the Sharwanand-starrer, which features Sakshi Vaidya and Samyuktha as heroines. Anil Sunkara has produced it on AK Entertainments.
"Producer Sudhakar Cherukuri has mounted Bhartha Mahasayulaku Wignyapthi on a grand scale and supported us at every step. We also shot extensively in Spain, which adds rich visual appeal to the film," say Ashika Ranganath and Dimple Hayathi, talking about their upcoming Ravi Teja-starrer. The family entertainer, directed by Kishore Tirumala, is up for a grand release on January 13.
Sakshi Vaidya, a trained physiotherapist who has previously acted in Agent and Gandeevadhari Arjuna, awaits the release of Nari Nari Naduma Murari this Sankranthi (January 14). In this interview, the heroine talks about acting in the Sharwanand-starring family entertainer. "I wanted the Telugu audience to see a new side to my acting," Sakshi says.
Mana Shankara VaraPrasad Garu is slated to be released in theatres on January 12. In this interview, producers Sahu Garapati and Sushmitha Konidela talk about the entertainer at length.
Nari Nari Naduma Murari is up for a grand theatrical release on the evening of January 14. Producer Anil Sunkara, in this interview, talks about the highlights in the Sharwanand-starrer. Co-starring Samyuktha and Sakshi Vaidya as heroines, the film is directed by Samajavaragamana fame Ram Abburi.
About Tollywood
Tollywood refers to the Telugu language film industry. The name derives the concept from Hollywood.Tollywood is based in the state of Andhra Pradesh in southern India. The major Tollywood studios are located in Hyderabad, AP. Tollywood is the largest producer of films in India. In average Tollywood produces between 200 and 250 Telugu movies a year.
Popular movies tend to open during the three festive seasons of the region: Sankranthi, Summer, and Dushera. The Telugu film industry accounts for 1% of the gross domestic product of Andhra Pradesh. Telugu films enjoy significant patronage in the neighboring southern States like Tamil Nadu, Karnataka.
The first Telugu film Bhishma Pratigna was made in 1922 by R.S. Prakash. The first Telugu talkie Bhakta Prahlada, was released in 1931.
Andhra Pradesh is the state having more than 2700 theaters, where Hyderabad alone consists of 150 theatres. It is arguably the state having the largest number of theaters.
For young heroines, waiting for a break in Bollywood - telugu movies are good place to begin with and are considered a gateway. This is because Tollywood is the biggest regional movie market in India and the work there is closely monitored by the big names in Hindi film industry who are on the lookout for storylines to remake and fresh talent be it actors or technicians.